TS: బీబీనగర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

భువనగిరి (CLiC2NEWS): యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని బీబీనగర్ మండలం గూడురు వద్ద ఆగిఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది.