TS: బ్యాంకు ఎంప్లాయిస్ కు క‌రోనా టీకా: సిఎస్‌

హైదరాబాద్‌(CLiC2NEWS): తెలంగాణ సిఎం కె.చంద్ర‌శేఖ‌ర‌రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల్లో అధికారులు, ఇత‌ర సిబ్బందికి స్పెష‌ల్ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపడతామని సిఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. వారం రోజుల్లో బ్యాంకు అధికారులు, సిబ్బందికి టీకా వేయ‌డం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బ్యాంకు ఉద్యోగులకు ప్రత్యేక వ్యాక్సినేష‌న్ డ్రైవ్ గురించి బీఆర్‌కేఆర్‌ భవన్‌లో ప‌లు బ్యాంకుల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అన్ని బ్యాంకుల‌ ఉద్యోగులకు వారంలోగా క‌రోనా టీకా వేసేలా చూడాలని అధికారులను సిఎస్ ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.