TS: మేడారం మహా జాత‌ర తేదీలు ఖరారు

ములుగు (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించే మేడారం మ‌హాజాత‌ర తేదీలు ఖ‌రారు అయ్యాయి. 2022 ఫిబ్ర‌వ‌రి 16 నుంచి 19వ తేదీ వ‌ర‌కు మేడారం స‌మ్మ‌క్క – సార‌ల‌మ్మ‌ను జాత‌ర‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు మేడారంలో ఇవాళ (ఆదివారం) నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో పూజారులు వెల్ల‌డించారు. తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో గల ఆదివాసీ గిరిజన దైవాలు శ్రీ మేడారం సమ్మక్క-సారలమ్మల మహా జాతరను ఆదివాసీ గిరిజన సాంప్రదాయ ప్రకారం మాఘ శుద్ధ పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. 2022, ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనున్నట్లు వారు వెల్ల‌డించారు.

2022లో జ‌రిగే జాత‌ర తేదీలు..

  • ఫిబ్ర‌వ‌రి -16- సార‌ల‌మ్మ‌, ప‌గిడిద్ద‌రాజు, గోవింద‌రాజులును గద్దెల‌వ‌ద్ద‌కు తీసుకొస్తారు.
  • ఫిబ్ర‌వ‌రి -17- చిల‌క‌ల గుట్ట నుంచి స‌మ్మ‌క్క దేవ‌త‌ను గ‌ద్దెల వ‌ద్ద‌కు చేరుస్తారు.
  • ఫిబ్ర‌వ‌రి -18స‌మ్మ‌క్క‌-సార‌క్క అమ్మ‌వార్ల‌ను ప్ర‌జ‌ల మొక్కులు స‌మ‌ర్పించుకోవ‌డం
  • ఫిబ్ర‌వ‌రి -19- వ‌న ప్ర‌వేశం, మ‌హాజాత‌ర ముగింపు
మేడారంలో ఆదివారం మీడియా స‌మావేశంలో పూజారులు
Leave A Reply

Your email address will not be published.