TS: వరంగల్ అర్బన్ జిల్లా పేరు ఇక హన్మకొండ జిల్లా: కెసిఆర్

హన్మకొండ:(CLiC2NEWS): వరంగల్ అర్బన్, గ్రామీణ జిల్లాలకు హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా పేర్లు మార్చుతున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానికుల విజ్ఞప్తుల మేరకు వరంగల్ అర్బన్ జిల్లా పేరును హన్మకొండ జిల్లాగా మార్చుతామని సీఎం పేర్కొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్ భవన సముధాయం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. జిల్లాల కొత్తపేర్లపై రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు వస్తాయన్నారు.
ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ..
అధునాతన జిల్లా కలెక్టరేట్ భనవాన్ని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్ నాయకులు, ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. “ప్రజలు పనులు వేగంగా జరిగితేనే ప్రజాస్వామ్యానికి సార్థకం అని అన్నారు. రాష్ట్రంలో మిగతా 30 కలెక్టరేట్‌లు కూడా త్వరగా పూర్తి కావాలని కెసిఆర్ అన్నారు.
తెలంగాణలో హైదరాబాద్‌తోపాటు మరో 4 నగరాలు అభివృద్ధి చెందాలని కెసిఆర్ అన్నారు. వరంగల్ నగరంలో దంతవైద్యశాల, దంత వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లో జనాభా విపరీతంగా పెరిగిపోయిందని, రాష్ట్రం మొత్తం హైదరాబాద్‌పై ఆధారపడితే జిల్లాలకు నష్టం కలుగుతుందని అన్నారు. ఇతర జిల్లాలు అభివృద్ధి చెందితే హైదరాబాద్‌పై భారం తగ్గుతుందని పేర్కొన్నారు.