TS: 14న బీజేపీ గూటికి ఈటల
హైదరాబాద్ (CLiC2NEWS): మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 14 న్యూఢిల్లీలో భారతీయ జనతాపార్టీ లో చేరనున్నారు. టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఈటల బిజెపిలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. 14న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షలో భారతీయ జనతాపార్టీ కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్ జడ్పీ చైర్మన్ తుల ఉమ తదితరులు బిజెపిలో చేరనున్నట్లు వినిపిస్తోంది. వీరితో పాటు పలు వురు నాయకులు కూడా బిజెపిలో చేరే అవకాశం ఉంది. కాగా వీలైనంత మంది టీఆర్ఎస్ నేతలను బీజేపీలో చేర్చడమే టార్గెట్‌గా ఈటల రాజేందర్ ముందుకు సాగుతున్నారు.