TS: 3 రోజులు వర్షాలు
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో సోమ, మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. పశ్చిమ దిశనుంచి వీచే గాలుల ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు పడుతాయని పేర్కొంది.
గత 24 గంటల్లో వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, నారాయణపేటతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా వికారాబాద్ జిల్లా తాండూర్, యాలాల్ జిల్లాల్లో 1.8 సెం.మీ. వర్షం కురిసింది.