TS: చెట్టును ఢీకొన్న బైకు: విద్యార్థి మృతి

కీస‌ర‌ (CLiC2NEWS): హైదరబాద్‌ శివార్లలోని ఔటర్‌ రింగ్‌రోడ్‌ సర్వీస్‌ రోడ్‌లో ఓ బైకు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్ద‌రు విద్యార్థుల్లో ఓ విద్యార్థి ఘ‌ట‌నాస్థ‌లంలోనే మృతి చెందాడు. మరో విద్యార్థికి తీవ్రంగా గాయల‌య్యాయి. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని ఆసుప‌త్రికి తరలించారు. మృతిచెందిన పోలీసులు విద్యార్థిని శేఖర్‌గా గుర్తించారు. జీడిమెట్లలోని షాపూర్‌ నుంచి హయత్‌నగర్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీలు వివ‌రించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ద‌ర్యాప్తు అనంత‌రం పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని తెలిపారు. గాయపడిన విద్యార్థికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.