TS: రేపు పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో రేపు టెన్త్ పరీక్ష ఫలితాల విడుదల కానున్నాయి. సిఎం రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు రవీంద్ర భారతి వేదికగా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 21 వ తేదీ నుండి ఏప్రిల్ 4 వరకు జరిగాయి. దాదాపుగా 5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హజరయ్యారు.
పరీక్ష ఫలితాలు సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్‌లు ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు సిజిపిఎ ఇచ్చేవారు. మార్కుల మెమోలపై సబ్జెక్టుల వారీగా రాత పరీక్షల మాలర్కులు, అంతర్గత పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు , గ్రేడ్ పొందుపరుస్తారు. చివరగా విద్యార్థి పాస్.. లేదా ఫెయిల్ అనే అంశం ఉంటుంది.