TS Corona: కొత్తగా 3,982 కేసులు, 27 మరణాలు
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,982 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. కాగా తాజాగా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 5,186 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ర్టంలో ప్రస్తుతం 48,110 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
జీహెచ్ఎంసీ పరిధిలో 607 పాజిటివ్ కేసులు నమోదు కాగా, రంగారెడ్డి 262, ఖమ్మం 247, మేడ్చల్ జిల్లాలో 225 కేసులు నమోదు అయ్యాయి.
- రాష్ట్రంలో కొత్తగా కరోనా కేసులు -3,982
- మరణాలు -27
- కోలుకున్న వారు- 5,186
- రాష్ట్రంలో యాక్టివ్ కేసులు -48,110
![]()
