TS Corona: కొత్తగా 7,994 కేసులు.. 58 మ‌ర‌ణాలు

హైదరాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో కరోనా విల‌య‌తాండ‌వం కొన‌సాగుతోంది.గడిచిన 24 గంటల్లో 80,181 మందికి కొవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు జ‌రుప‌గా 7,994 మందికి పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఈ మేర‌కు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ గురువారం హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. అలాగే తాజాగా 4009 మంది కోలుకోగా.. వైరస్‌ బారినపడి తాజాగా 58 మంది ప్రాణాలను కోల్పోయారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో మహమ్మారి బారినపడి మొత్తం 2,208 మంది ప్రాణాలు విడిచారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం యాక్టివ్ కేసులు 76వేలకు పైగా ఉన్నాయి. ప్రస్తుతం 76,060 యాక్టివ్‌ కేసులున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.

భారీగా కొత్త‌కేసులు న‌మోదైన జిల్లాలు..

అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,630 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌లో 615, రంగారెడ్డిలో 558, నల్గొండలో 424, సంగారెడ్డిలో 337, నిజామాబాద్‌లో 301, సూర్యపేటలో 264, సిద్దిపేటలో 269, మహబూబ్‌నగర్‌లో 263, జగిత్యాలలో 238, ఖమ్మంలో 213, మంచిర్యాలలో 201 కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,27,960కి పెరగ్గా.. ఇప్పటి వరకు 3,49,692 మంది కోలుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.