TS Corona: కొత్తగా 3,961 కేసులు.. 30 మరణాలు
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 3,961 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపిరాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,32,784 కి చేరింది.
గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో 30 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,985 కి చేరింది. రాష్ట్రంలో 4,80,458 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 49,341 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కొత్తగా గ్రేటర్ హైదరాబాద్ లో 631 కరోనా కేసులు నమోదయ్యాయి.