TS Corona: కొత్త‌గా 2,175 కేసులు

హైద‌రాబాద్ (CLiC2NEWS):  తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు భారీగా త‌గ్గాయి. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రాష్ట్రంలో 1,36,096 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వ‌హించ‌గా 2,175 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు శుక్ర‌వారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది.
తాజాగా రాష్ట్రంలో క‌రోనా బారిన‌ప‌డి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 3,821 మంది క‌రోనా బారి నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,918 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా జిహెచ్ ఎంసి ప‌రిధిలో కొత్త‌గా 253 కేసులు న‌మోద‌య్యాయి.

Leave A Reply

Your email address will not be published.