TS Corona: 93 శాతానికి రికవరీ రేటు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయని, ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 93 శాతంగా ఉందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కార్యాలయంలో ఆయన గురవారం మీడియాతో మాట్లాడారు.
గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 3,614 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే రాష్ట్రంలో 18 మరణాలు సంభవించాయి. తాజాగా కరోనా నుంచి కోలుకుని 3,961 మంది డిశ్చార్జి అయ్యారు.
మరోవైపు.. ఆస్పత్రుల్లో చేరే కరోనా బాధితుల సంఖ్య కూడా తగ్గుతుందని తెలిపారు శ్రీనివాస్‌రావు.. 10 రోజుల్లో బెడ్ ఆక్యుపెన్సీ రేటు 54 శాతం నుంచి 39 శాతానికి పడిపోయిందని, అలాగే రాష్ట్రంలో పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయని తెలిపారు. లాక్‌డౌన్, ఫీవర్ సర్వేలు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు.