TS Corona Vaccine: రెండో డోసు రేపు కూడా బంద్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS):  తెలంగాణ‌లో త‌గిన‌న్ని వాక్సిన్ నిల్వ‌లు లేని కార‌ణంగా 45 ఏళ్లు పైబ‌డిన వారికి సోమ‌వారం రెండో డోసు వ్యాక్సిన్‌ను వాయిదా వేస్తున్న‌ట్లు తెలంగాణ ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. వ్యాక్సిన్ల కొర‌త దేశంలోని ప‌లు రాష్ట్రాల‌ను వెంటాడుతూనే ఉంది. తెలంగాణ‌లోనూ అదే ప‌రిస్థితి. కేంద్రం స‌రిప‌డా డోసులు రానందు వ‌ల్ల టీకా నిల్వ‌లు నిండుకున్నాయి. దీంతో 45 ఏళ్లు పైబ‌డిన‌వారికి వ్యాక్సినేష‌న్ నిలిపేస్తున్న‌ట్లు ప్ర‌కటించింది. కేంద్రం నుంచి కోవాగ్జిన్ స్టాక్ రాలేద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. మ‌ళ్లీ వ్యాక్సినేష‌న్ ఎప్పుడ‌నేది త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని పేర్కొంది. కాగా, ఇప్ప‌టికే శ‌ని, ఆదివారాల్లో వ్యాక్సినేష‌న్ నిలిపివేసిన స‌ర్కార్.. ఇప్పుడు ఈ తాజా ప్ర‌క‌ట‌న చేసింది.

Leave A Reply

Your email address will not be published.