ఆర్‌టిసి ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌..

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ ఉద్యోగుల‌కు స‌ర్కార్ గుడ్‌న్యూస్ అందించింది. ఆర్‌టిసిని ప్ర‌భుత్వంలో విలీనం చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. సోమ‌వారం ముఖ్య‌మంత్రి కెసిఆర్ అధ్య‌క్ష‌త‌న మంత్రివ‌ర్గ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో అనేక కీల‌క విష‌యాలు చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో రాష్ట్రంలోని 43,373 మంది ఆర్‌టిసి కార్మికుల‌ను ప్ర‌భుత్వ ఉద్యోగులుగా మార‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు కేబినేట్ నిర్ణ‌యం తీసుకుంది. మంత్రివ‌ర్గం స‌మావేశ‌మై చ‌ర్చించిన వివ‌రాల‌ను మంత్రి కెటిఆర్ మీడియాకు వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.