ఎంసెట్‌కు ఒక్క నిమిషం నిబంధన సడలింపు!

హైదరాబాద్ (CLiC2NEWS): ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ ఇవాల్టి నుండి ప్రారంభం కానుంది. వర్షాల కారణంగా ఈ సారి ఒక్క నిమిషం ఆలస్యంనిబంధనలో సడలింపు ఇవ్వాలని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రోడ్లు దెబ్బతిని, రవాణా సౌకర్యం లేని ప్రాంతాల్లో కొన్ని నిమిషాలు ఆలస్యంగా వచ్చినా.. అందుకు సరైన కారణాం చూపిస్తే పరాక్షలకు అనుమతించాలని భావిస్తున్నారు. ఒకవేళ బాగా ఆలస్యంగా వస్తే.. తర్వాత రెండు రోజుల్లో ఏదో ఒక విడతలోనూ పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో మూడు రోజులు పరీక్షలు జరగునున్నాయి.