తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్, ఈ సెట్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఏప్రిల్ 6వ తేది నుండి మే 28 తేది వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. ఇంజనీరింగ్ లేదా అగ్రికల్చర్ విభాగాల కోసం ఎస్సి, ఎస్టి, దివ్యాంగులకు రూ. 400, ఇతరులు రూ. 800, రెండూ రాసే అభ్యర్థులు రూ. 1600 చెల్లించాల్సి ఉంటుంది. ఎంసెట్ పరీక్ష జులై 14వ తేది నుండి 5రోజులపాటు జరగనుంది. జులై 14,15 తేదీల్లో అగ్రికల్చర్, 18,19,20 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగంలో పరీక్షలు నిర్వహిస్తారు.
పాలిటెక్కిక్ డిప్లొమా, బిఎస్సి మాథ్స్చదివిన విద్యార్థలు బిటెక్, బిపార్మసి రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించే ఈసెట్ నోటిఫికేషన్ జారీ చేశారు. జులై 13వ తేదీన జరగనున్న ఈ సెట్‌కు ఏప్రిల్ 6వ తేది నుండి జూన్ 6వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎస్సి, ఎస్టి దివ్యాంగులకు రూ. 400, ఇతరులు రూ. 800 ఫీజు చెల్లించాలని ఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ తెలిపారు.