TS: గోల్కొండ కోటపై మువ్వన్నెల జెండా
జాతీయ జెండాను ఆవిష్కరించిన సిఎం కెసిఆర్

హైదరాబాద్ (CLiC2NEWS) : రాష్ట్రంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గోల్కొండ కోటలోని రాణిమహల్ ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగురవేశారు. తదనంతరం సాయుధ దళాల గౌరవవందనం స్వీకరించారు. ఈసందర్భంగా సిఎం కెసిఆర్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. తెలంగాణ సాధించుకున్నప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. దేశంలో తెలంగాణ నంబర్ వన్‌గా, ఆదర్శరాష్ట్రంగా తీర్చిదిద్దామని ఆయన అన్నారు.