రాజ్‌భవన్‌కు తెలంగాణ సర్కార్ వివరణ
హైదరాబాద్ (CLiC2NEWS): టిఎస్ఆర్‌టిసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ బిల్లును శుక్రవారం శాసన సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించింది. కానీ గవర్నర్ అనుమతి లభించక పోవడంతో..ఆర్‌టిసి బిల్లును ఆమోదించాలని కార్మికులు శనివారం బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాజ్‌భవన్ నుండి ప్రకటన వెలువడింది. కొన్ని అంశాలపై వివరణ కోరుతు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ పంపారు. ఆర్టిసి ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా ఈ వివరణ అవసరమని.. వీటికి సమాధానం ఇస్తే.. బిల్లు త్వరగా నిర్ణయం తీసుకోవాడానికి వీలుంటుందని పేర్కొన్నారు.
ఆర్‌టిసి బిల్లుపై గవర్నర్ కోరిన వివరణకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. గవర్నర్ అడిగిన ఐదు అంశాలకు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఆర్‌టిసి ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలోకి తీసుకుంటున్నామని, సంస్థ యథాతథంగా కొనసాగుతుందని తెలిపింది. టిఎస్ ఆర్‌టిసి యథాతథంగా కొనసాగుతుందని.. దీనివల్ల విభజన చట్టానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేసింది. అదేవిధంగా కేంద్ర వాటా, గ్రాంట్లు, రుణాల వివరాలు అవసరం లేదని పేర్కొంది. కార్మికుల ప్రయోజనాల పరిరక్షణే బిల్లు ప్రధాన లక్షణమని రాష్ట్ర సర్కార్ స్పష్టం చేసింది. ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకున్న తర్వాత వారితో చర్చించి.. వేతనాలు, భత్యం, కేడర్, పదోన్నతులు, పింఛనుకు సంబంధించి నిర్ణయాలు చేయనున్నట్లు తెలిపారు. ఎవరికి ఎటువంటి సమస్యలు ఉండవని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు అన్ని అంశాలకు వివరణ ఇచ్చామని.. బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం కోరింది.
ఆర్‌టిసి ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం.. ఈ బిల్లులో ఐదు అంశాలపై గవర్నర్ తమిళిసై వివరణ కోరినట్లు సమాచారం. ఆర్‌టిసిలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్ల వివరాలు లేవు. ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడుతారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పింఛన్ ఇస్తారా.. విభజన చట్టం ప్రకారం ఆర్‌టిసి స్థితిని మార్చడంపై వివరాలు లేవు. పదోన్నతులు, క్యాడర్ నార్మలైజేషన్‌లో న్యాయం ఎలా చేస్తారు. అని రాష్ట్ర ప్రభుత్వవాన్ని గవర్నర్ ప్రశ్నించారు.