TS: మరో మూడు రోజులు విద్యా సంస్థలు బంద్
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలోని విద్యా సంస్థలకు మరో మూడురోజుల పాటు సెలవులను సర్కారు పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులను జారీ చేసింది గత సోమవారం మూడు రోజుల పాటు (నేటి వరకు) సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటం.. పలు చోట్ల వరద పరిస్థితులు ఉండటంతో మరో మూడు రోజులు సెలవులు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వాతావరణ శాఖ, విద్యాశాఖ అధికారులతో చర్చలు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. గతవారం రోజులుగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురస్తున్నందున రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు మూడు రోజులపాటు (సోమ, మంగళ, బుధవారం) సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సర్కార్ తొలుత ప్రకటించిన విధంగా బుధవారం (నేటి)తో గడువు ముగిసిపోనుండటంతో తాజాగా మరో మూడు రోజులు సెలవులు పొడిగించారు. సోమవారం పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
