తెలంగాణలో ‘ఆచార్య’ సినిమా టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్
ఐదో షోకు వారం రోజులు అనుమతి

హైదరాబాద్ (CLiC2NEWS): చిరంజీవి-రామ్‌చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య . ఈ చిత్రం ఏప్రిల్ 29వ తేదీన విడుదలకానున్న విషయం తెలిసినదే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లను పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. దీంతో పాటు వారం రోజుల పాటు ఆచార్య సినిమా ఐదోషోకు ప్రదర్శించుకొనేలా థియేటర్ల యాజమాన్యాలకు అవకాశం కల్పించింది. ఒక్కో టికిట్‌పై మల్టిప్లెక్స్‌ల్లో రూ. 50, సాధారణ ఎసి థియేటర్లో రూ. 30 పెంచుకొనేందుకు అవకాశం ఇచ్చింది.