కొత్తగా 14,954 పోస్టులు మంజూరు..
రాష్ట్రంలో విఆర్ఎల సర్దుబాటు..
![](https://clic2news.com/wp-content/uploads/2022/08/TS-logo.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ప్రభుత్వం విఆర్ ఎల ను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కెసిఆర్ వారిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో
ప్రభుత్వ విభాగాల్లోని వివిధ శాఖల్లో వారిని సర్దుబాటు చేయడం కోసం 14,954 పోస్టులను మంజూరు చేసింది. రెవెన్యూ శాఖలో జూనియార్ అసిస్టెంట్ పోస్టులు 2,451, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు 2,113, సబార్డినేట్ పోస్టులు 679 మంజూరు చేసింది. మిషన్ భగీరథ శాఖలో హెల్పర్ పోస్టులు 3,372, నీటిపారుదల శాఖలో లష్ర్, హెల్పర్ పోస్టులు 5,063.. పురపాలక శాఖలో వార్డు ఆఫీసర్ పోస్టులు 1,266 ప్రభుత్వం మంజూరు చేసింది.