TS: శాసన సభలో హరిత నిధి ప్రతిపాదన

హైదరాబాద్(CLiC2NEWS) :తెలంగాణ రాష్ట్రంలో హరిత హారానికి తోడుగా హరిత నిధి (తెలంగాణ గ్రీన ఫండ్) కార్యక్రమం ఏర్పాటు గురించి సిఎం కెసిఆర్ శాసన సభలో ప్రతిపాదన చేశారు. ఈ సందర్భంగా హరితహారం కార్యక్రమాన్ని యూఎన్‌వో గుర్తించి ప్రశంసించిందని ఆయన తెలిపారు. నిరంతరం హరిత ఉద్యమాన్ని కొనసాగించడానికి ఈ ప్రతిపాదనను తీసుకొచ్చామని ఆయన తెలిపారు. హరితహారంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ చేపట్టిన సందర్భంగా సీఎం కేసీఆర్ హరిత నిధిపై ప్రకటన చేశారు.
రాష్ట్రంలోని ఐఎఎస్ ,ఐపిఎస్ ఐఎఫ్ ఎస్ అధికారులు తమ నెలవారి జీతం నుంచి హరిత నిధికి రూ. 100 ఇస్తామాని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి నెల రూ.25లు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మల్సీలు రూ. 500లు హరిత నిధికి ఇస్తామని ఒప్పుకున్నారు. విద్యార్థులను కూడా భాగస్వాములను చేయాలనే ఆలోచన ఉంది . విద్యార్థులు తమ పాఠశాలలు, కాలేజీల్లో ప్రవేశాలు పొందే సమయంలో.. ప్రథమిక పాఠశాల విద్యార్థులు రూ. 5, హైస్కూల్ విద్యార్థులు రూ. 15, ఇంటర్ విద్యార్థులు రూ. 25, డిగ్రీ విద్యార్థులు రూ. 50, అదే విధంగా ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులు రూ. 100 ఇస్తే హరిత నిధికి తోడ్పాటు ఉంటుందన్నారు.
లైసెన్సెస్ రెన్యూవల్ సమయంలో వ్యాపారులు, భార్లు, మద్యం దుకాణదారులు హరిత నిధికి జమ చేయాలి . వారు రూ. 1000.. హరిత నిధి కింద జమ చేయాలి. భూముల అమ్మకాలు, కొనుగోలు చేసేటప్పుడు ప్రతి రిజిస్ట్రేషన్ కు హరిత నిధికి రూ. 50 జమ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని సిఎం తెలిపారు. హరిత నిధికి నిరంతరం నిధులు సమకూరితే అద్భుత ఫలితాలు వస్తాయని అన్నారు.