TS: పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

హైదరాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల‌లో రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం గురువారం తెలిపింది. విదర్భ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉందని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

దీని ప్రభావంతో తెలంగాణ‌లో మూడు రోజులు తేలిక పాటి మోస్తరు వానలు పడుతాయని పేర్కొంది. తెలంగాణలోని ఉత్తర, తూర్పు జిల్లాల్లో ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్‌, కామారెడ్డి, నారాయణపేట, మహబాబూబ్‌నగర్‌, కొత్తగూడెంతో పాటు జిల్లాల్లో మోస్తరు వర్షాపాతం నమోదైందని వాతావ‌ర‌ణ‌శాఖ పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.