TS High Court: ఏడుగురు కొత్త జడ్జిల నియామకం
హైదారాబాద్ (CLiC2NEWS): తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నోటఫికేషన్ విడుదల చేసిది.సెప్టెంబరు 16వ తేదీన కొలీజియం పంపినన సిఫార్స్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. జడ్జిలుగా నియమితులైన వారు జస్టిస్ పి. శ్రీసుధ, జస్టిస్ సి. సుమలత, జస్టిస్ డాక్టర్ జి. రాధారాణి, జస్టిస్ పి. మాధవిదేవి, జస్టిస్ ఎన్. తుకారామ్, జస్టిస్ ఎం. లక్ష్మణ్, జస్టిస్ ఎ. వెంకటేశ్వరరెడ్డి ఉన్నారు.
సిజెఐ జస్టిస్ ఎన్.వి. రమణ జూన్ నెలలో కోర్టులోని న్యాయమూర్తుల సంఖ్యను 24 నుండి 42కి పెంచేలా చర్యలు తీసుకున్నారు. ఖాళీల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని కొత్త నియామకాలను సిఫార్సు చేశారు. కొత్తగా ఏడుగురు జడ్జిల నియామకంతో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 18కి చేరింది.