TS: ఇంటింటికి జ్వ‌ర స‌ర్వే..

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ఫీవ‌ర్ స‌ర్వే ప్రారంభ‌మైంది. హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇంటింటికి స‌ర్వే చేప‌ట్టారు. వైద్యారోగ్య సిబ్బంది ప్ర‌తి ఇంటికీ వెళ్లి వారి వివ‌రాల‌తో పాటు జ్వ‌రం. జ‌లుబు, ద‌గ్గు, గొంతునొప్పి త‌దిత‌ర ల‌క్ష‌ణాలున్నాయా అని అడిగి తెలుసుకుంటున్నారు. అవ‌స‌ర‌మైన వారికి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ల‌క్ష‌ణాలున్న ప్ర‌తి ఒక్క‌రికీ హోం ఐసోలేష‌న్ కిట్‌ను అంద‌జేస్తున్నారు. ల‌క్ష‌ణాలు తీవ్ర‌త క‌నిపిస్తే.. వెంట‌నే ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లిస్తారు. నాలుగైదు రోజుల్లో ఫీవ‌ర్ స‌ర్వేను పూర్తి చేయాల‌నే ల‌క్ష్యంతో అధికారులు ఉన్నార‌ని స‌మాచారం.

TS: వ‌చ్చే 3 వారాలు కీల‌కం: మ‌ంత్రి హరీశ్‌రావు

Leave A Reply

Your email address will not be published.