TS కొవిడ్ పరీక్షలు పెంచండి..

వ్యాక్సినేషన్​ను వేగవంతం చేయండి: సిఎం కెసిఆర్‌

అనాథల సమస్యలు గుర్తింపునకు కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు

తెలంగాణ కేబినెట్‌కీల‌క నిర్ణ‌యాలు

 

హైదరాబాద్ ‌(CLiC2NEWS): సిఎం కెసిఆర్ అధ్య‌క్షత‌న ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో తెలంగాణ మంత్రివ‌ర్గం స‌మావేశ‌మై ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. జిల్లాల్లో క‌రోనా ప‌రిస్థితి, వ్యాక్సినేష‌న్ ఏర్పాట్ల‌పై మంత్రి వ‌ర్గం ఇవాళ చ‌ర్చించింది. కేసులు ఎక్కువ‌గా ఉన్న జిల్లాల స‌మాచారాన్ని అధికారులు కేబినెట్ ముందుంచారు. రాష్ట్రంలో క‌రోనా వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయాల‌ని, ఔష‌ధాలు, ఆక్సిజ‌న్ కొర‌త లేకుండా చూడాల‌ని అధికారుల‌ను కేబినెట్ ఆదేశించింది.

అలాగే జిల్లాల్లో క‌రోనా ప‌రీక్ష‌ల‌ను పెంచాల‌ని సూచించింది. రాష్ట్రంలో కొత్త‌గా మంజూరైన 7 మెడిక‌ల్ క‌ళాశాల‌లు ప్రారంభించాల‌ని స‌ర్కార్ నిర్ణ‌యించింది.

కొవిడ్ కార‌ణంగా త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయి అనాథ‌లైన పిల్ల‌ల వివ‌రాల‌ను అన్ని జిల్లా క‌లెక్ట‌ర్ల నుంచి తెప్పించాల‌ని వైద్య శాఖ కార్య‌ద‌ర్శిని కేబినెట్ ఆదేశించింది.
రాష్ట్రంలో అనాథలు, అనాథ శరణాలయాల స్థితిగతులు, సమస్యలు, అవగాహన విధాన రూపకల్పన కోసం, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు.
ఈ కమిటీలో సభ్యులుగా ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, అటవీశాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సభ్యులుగా ఉండనున్నారు.

ఏడాది రూ. 50 వేల లోపు రైతు రుణాలు మాఫీ చేయాల‌ని తెలంగాణ కేబినెట్ నిర్ణ‌యించింది. రుణ‌మాఫీ అంశంపై కేబినెట్‌లో చ‌ర్చ జ‌రిగింది. పంద్రాగ‌స్టు నుంచి నెలాఖ‌రులోపు రూ. 50 వేల రుణ‌మాఫీని పూర్తి చేయాల‌ని కేబినెట్ నిర్ణ‌యించింది. ఈ నిర్ణ‌యంతో రాష్ట్రంలో 6 ల‌క్ష‌ల మంది రైతుల‌కు ల‌బ్ధి చేకూర‌నుంది.

Leave A Reply

Your email address will not be published.