రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం..
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సిజెగా జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళసై ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు సిఎస్ శాంతి కుమారి, డిజిపి అంజనీ కుమార్ తదితర ప్రముఖులు హజరయ్యారు. జస్టిస్ ఆలోక్ అరాధే 2018 నవంబరు నుండి కర్ణాటక హైకోర్టు జడ్జిగా ఉన్నారు. కొలీజియం సిఫార్సు మేరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.