ల‌గ‌చ‌ర్ల భూసేక‌ర‌ణ నోటిఫికేష‌న్ ఉప‌సంహ‌ర‌ణ: రాష్ట్ర స‌ర్కార్‌

హైదరాబాద్ (CLiC2NEWS): ల‌గ‌చ‌ర్ల‌లో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు భూసేక‌ర‌ణ నోటిఫికేష‌న్ ఉప‌సంహ‌రిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకంఉంది. భూసేక‌ర‌ణ కోసం ప్ర‌భుత్వం ఈ ఏడాది ఆగ‌స్టు 1వ తేదీన నోటిఫికేష‌న్ జారీ చేసింది. గ్రామ‌స్తుల నుండి భూసేక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు వ్య‌క్త‌మువుతున్నాయి. సిఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 588 మంది రైతుల‌కు చెందిన 632 ఎక‌రాల భూసేక‌ర‌ణ నోటిఫికేష‌న్ ప్ర‌భుత్వం ఉప‌సంహ‌రించుకుంది.

ఇటీవ‌ల భూసేక‌ర‌ణ నిమిత్తం గ్రామ‌స‌భ‌కు వెళ్లిన అధికారుల‌తో గ్రామ‌స్తుల ప్ర‌వ‌ర్తించిన తీరు ర‌ణ‌రంగాన్ని త‌ల‌పించిన విష‌యం తెలిసిందే. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం ల‌గ‌చ‌ర్ల‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న రాష్ట్రవ్యాప్తంగా సంచ‌ల‌నం రేకిత్తించింది. ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌కు గ్రామ‌స‌భ నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణయించి.. కాలెక్ట‌ర్‌, స‌బ్ క‌లెక్ట‌ర్ , కొడంగ‌ల్ ఏరియా డెవ‌ల‌ప్ మెంట్ అథారిటి (క‌డా) ప్ర‌త్యేకాధికారి గ్రామానికి వెళ్లారు. ఆ సమ‌యంలో గ్రామా రైతులు క‌ర్ర‌ల‌తో, రాళ్ల‌తో దాడికి య‌త్నించారు. క‌డా ప్త్ర‌త్యేకాధికారికి గాయాల‌య్యాయి. మ‌రో పోలీసు అధికారిపై కూడా దాడి జ‌రిగింది. దీనిపై కేసు న‌మోదైంది. ఈ కేసులో బిఆర్ ఎస్ మాజి ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి స‌హా ప‌లువురిని అరెస్టు చేశారు.

Leave A Reply

Your email address will not be published.