TS: 80 ఏళ్లు దాటిన వారు ఇంటినుండే ఓటేయొచ్చు..
హైదరాబాద్ (CLiC2NEWS): అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 80 ఏండ్లు దాటిన సీనియర్ సిటిజన్స్‌కు శుభవార్త తెలిపారు. తొలిసారిగా రాష్ట్రంలో ఇంటినుండే ఓటు వేసే అవకాశం కల్పించారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలపై సమీక్ష నిర్వహించేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా ప్రధాన కమిషనర్ సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యాస్ తెలిపారు. 80 ఏండ్లు దాటిన వారు ఇంటినుండే ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశం కల్పించారు. ఇంకా రాష్ట్రంలో యువ ఓటర్ల సంఖ్ఓయ 8 లక్షల దాటిందని.. ఇది ప్రశంసించదగ్గ విషయమన్నారు. అదేవిధంగా స్త్రీ, పురుష ఓటర్లు సమానంగా ఉండటం శుభ పరిణామం అని అన్నారు.