తెలంగాణలో బస్ ఛార్జీల మోత.. బస్‌పాస్ ఛార్జీలు కూడా పెంచిన టిఎస్ ఆర్టీసీ

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచింది. ప్యాసింజర్ సెస్ పేరుతో ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో రూ. 5 చొప్పున, సూపర్ లగ్జరీ, రాజధాని , గరుడ బస్సుల్లో రూ. 10 వరకు టికెట్ రేట్లు పెరిగాయి. పెరిగిన ఛార్జీలు తక్షణమే అమలులోకి వస్తాయని టిఎస్ ఆర్‌టిసి వెల్లడించింది.
దీంతో పాటు జనరల్, ఎన్జీవోస్ బస్‌సాస్ ఛార్జీలను కూడా పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. బస్‌పాస్‌ల ధరలు గరిష్టంగా రూ. 500గా నిర్ణయించింది. ఇవి ఏప్రిల్ 1వ తేదినుండి అమలులోకి రానున్నాయని వెల్లడించారు.
జనరల్ బస్‌పాస్..
ఆర్డినరీ బస్‌పాస్- రూ. 950 నుండి రూ.1,150 కిపెంపు
మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్‌పాస్- రూ. 1,075 నుండి రూ. 1,300 కి పెంపు
మెట్రో డీలక్స్ బస్‌పాస్- రూ. 1,185 నుండి రూ. 1,450కి పెంపు
పుష్పక్ పాస్ రూ. 2,500 నుండి రూ. 3,000కి పెంపు
ఎన్జీవో బస్‌పాస్..
ఆర్డినరీబస్‌పాస్- రూ. 320 నుండి రూ. 400 కి పెంపు
మెట్రో బస్‌పాస్- రూ. 550కి పెంపు
మెట్రో డీలక్స్ బస్‌పాస్- రూ 575 నుండి రూ. 700 కి పెంపు
ఎంఎంటిఎస్- ఆర్టీసీ కాంబో టికెట్ ఛార్జీని రూ. 1,350 పెంచింది.