టిఎస్ ఆర్‌టిసి మరో గుడ్‌న్యూస్
హైదరాబాద్ (CLiC2NEWS): పండక్కి సొంతూళ్లకు వెళ్లిన వారికోసం టిఎస్ ఆర్‌టిసి ఎండి సజ్జనార్ మరో శుభవార్త నందించారు. గ్రామాలకు వెళ్లిన వారు తిరిగి హైదరాబాద్‌కు వచ్చే వారి కోసం 3,500 స్పెషల్ బస్సులను నడపనున్నది.
ఈమేరకు ఆర్టిసి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.