childrens day : చిన్నారుల‌కు టిఎస్ ఆర్టీసీ కానుక‌.. ఎండి సజ్జనార్ మరో కీలక నిర్ణయం

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకువెళ్లేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌. చిల్డ్రన్స్ డే సందర్భంగా TSRTC ఎండీ వీసీ సజ్జనార్ పిల్లలకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు.

బాల‌ల దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకున్ని చిన్నారుల‌కు టిఎస్ ఆర్టీసీ కానుక ప్ర‌క‌టించింది. ఇవాళ (ఆదివారం) 15 సంవ‌త్స‌రాల‌లోపు పిల్ల‌లు ఆర్టీసీ బ‌స్సులో ఉచితంగా ప్ర‌యాణించ‌వ‌చ్చ‌ని తెలిపింది. దీనికి సంబంధించి ఆర్టీసీ చైర్మ‌న్ గోవ‌ర్థ‌న్‌, ఎండి స‌జ్జ‌నార్ నిర్ణ‌యం తీసుకున్నట్లు ఆర్టీసీ వెల్ల‌డించింది.

ఈ రోజు 15 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు బస్సుల్లో టికెట్ ఉండదని, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రకటించారు. ఏసీ, మెట్రో డీలక్స్, ఆర్డినరీ ఇలా ఏ బస్సు లోనూ చిన్నారుల‌కు టికెట్ అవ‌స‌రం లేద‌ని స‌జ్జ‌నార్ తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.