హైదరాబాద్‌లోని ఐటి ఉద్యోగులకు టిఎస్ ఆర్టిసి గుడ్‌న్యూస్!

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని ఐటి కారిడార్‌లో ప్రత్యేకంగా షటిల్ సర్వీసులను నడపాలని టిఎస్ ఆర్‌టిసి నిర్ణయించింది. ప్రస్తుతం ఐటి ఉద్యోగులు సొంత వాహనాల్లో కార్యాలయాలకు వెళుతూ ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసే ఈ షటిల్ సర్వీసులు వ్వారా తక్కువ వ్యయంతో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. హైటెక్ సిటి, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఈ సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సేవలను సులభంగా పొందేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఒక యాప్‌ను రూపొందిస్తున్నారు. దీని ద్వారా టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా.. సర్వీస్‌లకు ట్రాకింగ్ సదుపాయం కల్పిస్తుంది. బస్ ఎక్కడ ఉంది.. ఏయే ప్రాంతాల్లో తిరుగుతుంది.. అనే వివరాలు తెలుసుకునే అవకాశముంది. మహిళల భద్రత దృష్ట్యా ఈ షటిల్ సర్వీస్ బస్‌లకు ట్రాకింగ్ సదుపాయాన్ని కల్పించినట్లు టిఎస్ ఆర్‌టిసి తెలిపింది.
Looking forward to reading more. great article. Really looking forward to reading more books. cool. I really enjoy reading a thought provoking article. Also, thanks for allowing me to comment!
Very nice post. I just stumbled upon your blog and wanted to say that I’ve really enjoyed browsing your blog posts. In any case I’ll be subscribing to your feed and I hope you write again soon!