TS: కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోంది: సిఎం కెసిఆర్
ఇందిరా పార్క్ వద్ద 18న మహాధర్నా

హైదరాబాద్(CLiC2NEWS): తెలంగాణ భవన్‌లో టిఆర్ఎస్ఎల్పి సమావేశం ముగిసిన అనంతరం సిఎం కెసిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి పాటిస్తోందని ధ్వజమెత్తారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని సిఎం స్పష్టం చేశారు. కేంద్ర మంత్రిని కలిసి 50 రోజులు గడిచినా సమస్య పరిష్కారం కాలేదని, యాసంగిలో 5 లక్షల ధాన్యాన్ని కొంటామని చెప్పిన కేంద్రం నుంచి ఉలుకుపలుకు లేదు. ఎఫ్‌సిఐ కొనుగోలు చేస్తామంటే కేంద్రం నిరాకరిస్తోందన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేసేవరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు, యాసంగిలో వరి వేయమంటారా లేదా అని ప్రధానికి రేపు ఉదయం లేఖ రాయబోతున్నాను. నారుమళ్లు పోస్తే రైతులు నష్టపోయే ప్రమాదముంది . ఏవిషయం వెంటనే కేంద్రం స్పష్టం చేయాలని అన్నారు.
ఇందిరా పార్క్ వద్ద 18న మహాధర్నా
తెలంగాణ రైతాంగం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 18 వ తేదీన ఇందిరా పార్క్ వద్ద టిఆర్ఎస్ మహాధర్నా చేపడుతుందని సిఎం ప్రకటించారు. టిఆర్ఎస్ మహాధర్నా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులంతా ఈ ధర్నాలో పాల్గొంటారు. ధర్నా తర్వాత రెండురోజులు వేచి చూస్తాం.ఆ తర్వాత రైతులు ఏ పంట వేయాలో ప్రకటిస్తామని కెసిఆర్ పేర్కొన్నారు. అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లి తమ డిమాండ్లపై వినతిపత్రం సమర్పిస్తామన్నారు.