TS: వచ్చే 3 వారాలు కీలకం: మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్ (CLiC2NEWS): దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కూడా కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యలో రానున్న 3 వారాలు కీలకమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖామంత్రి హరీశ్ రావు తెలిపారు. ఆయన మంగళవారం నూతనంగా నిర్మించిన ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలందరూ మాస్క్ తప్పనిసరిగా ధరించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని,ఎఎన్ ఎమ్ సబ్‌సెంటర్, పిహెచ్‌సి, ప్రభుత్వ ఆసుపత్రులకు ఎక్కడికి వెళ్లినా కరోనా పరీక్షలు చేసేందుకు కిట్లు సిద్ధంగా ఉన్నాయని తెలియజేశారు.
ఎంత మందికి కరోనా వైరస్ సోకినా మందులు ఇచ్చేందుకు వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల కొవిడ్ టెస్టింగ్ ఎక్విప్‌మెంట్ సిద్ధంగా ఉందని, కోటి మందికి సరిపడా హోం ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి వెల్లడించారు.