వాయిదా పడిన పరీక్షల తేదీలు ప్రకటించిన టిఎస్‌పిఎస్‌సి
![](https://clic2news.com/wp-content/uploads/2021/03/tspsc.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): ప్రశ్నా పత్రాల లీకేజి కారణంగా వాయిదా పడిన పరీక్షలకు కొత్త తేదీలను ఖరారు చేసినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. జులై 8వ తేదీన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష నిర్వహించనున్నారు. జులై 13,14 వ తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు వారం రోజుల ముందు హాల్ టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. హాల్‌టికెట్లను టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సెట్‌లో అందుబాటులో ఉంటాయి.