టిఎస్‌పిఎస్‌సి లీకేజి కేసు.. డిఎఒ పేప‌ర్ రూ.10 ల‌క్ష‌ల‌కు బేరం..

హైద‌రాబాద్ (CLiC2NEWS): టిఎస్‌పిఎస్‌సి ప్ర‌శ్నాప‌త్రం లీకేజి కేసులో విస్తుపోయే విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ప్ర‌ధాన నిందితుడు ప్ర‌వీణ్ నుండి డిఎఒ (డివిజ‌న‌ల్ అకౌంట్స్ ఆఫీస‌ర్‌) పేప‌ర్‌ను రూ. 10 ల‌క్ష‌ల‌ సాయిలౌకిక్ అత‌ని భార్య సుస్మిత కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం. దంప‌తులిద్ద‌రినీ పోలీసులు అరెస్టు చేశారు. సుస్మితా సాప్ట్‌వేర్ ఇంజినీర్‌. అక్టోబ‌ర్‌లో గ్రూప్‌-1 ప్రిలిమ్స్ రాసిన ఆమె.. ఒఎంఆర్ షీట్‌లో హాల్ టికెట్ నంబ‌ర్‌ను రాంగ్ బ‌బ్లింగ్ చేయ‌డంతో టిఎస్‌పిఎస్‌సి ఆమెను అన‌ర్హ జాబితాలో చేర్చింది. దీంతో త‌న‌కు న్యాయం చేయాలంటూ సుస్మిత టిఎస్‌పిఎస్‌సి కార్యాల‌యానికి వ‌చ్చి అధికారుల‌ను క‌లిసింది. ఈ క్ర‌మంలో ప్ర‌వీణ్‌ను క‌లిసిన‌ట్లు తెలుస్తోంది.

సుస్మిత రూ. 10 ల‌క్ష‌లకు డిఎఒ పేప‌ర్‌కు బేరం మాట్లాడుకున్నారు. ముందుగా రూ. 6 ల‌క్ష‌లు.. రిజ‌ల్ట్స్ అనంత‌రం మ‌రో రూ. 4 ల‌క్ష‌లు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. సుస్మిత భ‌ర్త ప్ర‌వీణ్ అకౌంట్‌కు మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్ చేశాడు. అంత మొత్తం డిపాజిట్ గురించి సిట్ అధికారులు ఆరా తీయ‌గా అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది.
కాపీని తీసుకున్న‌ట్లు సిట్ అధికారుల విచార‌ణ‌లో

Leave A Reply

Your email address will not be published.