పేపర్ లీకేజి కేసు.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు

హైదరాబాద్ (CLiC2NEWS): టిఎస్‌పిఎస్‌సి ప్రశ్నాపత్రాల లీకేజి కేసులో తాజాగా 15 ప్రశ్నాపత్రాలును సిట్ అధికారులు గుర్తించారు. సిట్ దర్యాప్తులో విస్తుపోయో విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుల పెన్‌డ్రైవ్‌లో ప్రశ్నాపత్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గ్రూప్-1ప్రిలిమ్స్, ఎఇఇ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్-డిఎఒ జనరల్ స్టడీస్, మ్యాథ్స్ – ఎఇ జనరల్ స్టడీస్ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ పేపర్లు – ఎఇ సివిల్, ఎలక్ట్రికల్ పేపర్2 – టౌన్ ప్లానింగ్ – జులైలో జరగాల్సిన జెఎల్ పేపర్‌లు పెన్‌డ్రైవ్‌లో గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు.