TSPSC: ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు.. మరో 13 మంది డిబార్..
హైదరాబాద్ (CLiC2NEWS): ప్రశ్నాపత్రాల లీకేజీ కేసుతో సంబంధం ఉన్న మరో 13 మందిపై టిఎస్‌పిఎస్‌సి అనర్హత వేటు వేసింది. లీకేజీ కేసుతో సంబంధం ఉన్న వారిని డిబార్ చేయాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసినదే. ఈ కేసులో సంబంధం ఉన్న 37 మందికి నోటీసులు జారీ చేసింది. టిఎస్‌పిఎస్‌సి నిర్వహించే ఎటువంటి పరీక్షలు రాయకుండా అనర్హులుగా ప్రకటించింది. తాజాగా మరో 13 మందిని డిబార్ చేసింది. వీరు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలకు హాజరుకాకుండా, ఉద్యోగాలు పొందకుండా చర్యలు తీసుకుంది.
తప్పక చదవండి: TSPSC కీలక నిర్ణయం