హైద‌రాబాద్ నుండి విజ‌య‌వాడ‌ వెళ్లే ప్ర‌యాణికుల‌కు ఆర్‌టిసి ఆఫ‌ర్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): విజ‌య‌వాడ వెళ్లాల‌నుకునే ప్ర‌యాణికుల‌కు టిఎస్ ఆర్టీసీ 10 శాతం రాయితీ క‌ల్పించ‌నుంది. ఈ అవ‌కాశం ఈ నెల 30 వ‌ర‌కు అమ‌ల్లో ఉంటుంద‌ని ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ మార్గంలో న‌డిచే సూప‌ర్ ల‌గ్జ‌రీ, రాజ‌ధాని ఎసి స‌ర్వీసుల్లో రానుపోనూ ఈ రాయితీ వ‌ర్తిస్తుంది. హైద‌రాబాద్ నుండి విశాఖ‌ప‌ట్నం వెళ్లాల‌నుకుంటే.. విజ‌య‌వాడ వ‌ర‌కు 10 రాయితీ క‌ల్పిస్తారు. ఈ రాయితీ వ‌ల్ల ఒక్కొక్క‌రికీ రూ.40 నుండి రూ.50 వ‌ర‌కు ఆదా అవుతుంది. ఈ స‌దుపాయాన్ని వినియోగించుకోవాల‌ని టిఎస్ ఆర్‌టిసి ఛైర్మ‌న్ గోర్ధ‌న్‌, సంస్థ ఎండి స‌జ్జ‌నార్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.