మరోసారి టిఎస్ ఆర్టీసీ ఛార్జీలు పెంపు
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ఆర్టీసీ మరోసారి బస్సు ఛార్జీలు పెంచింది. టోల్ ప్లాజాలు, పాసింజర్స్ సెస్ పేరిట ఛార్జీలు పెంచిన ఆర్టీసీ తాజాగా మరోసారి డీజిల్ సెస్ పేరుతో ఛార్జీలు పెంచింది. ఆర్డినరీ సర్వీసులలో డీజిల్ సెస్ కింద రెండు రూపాయలు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్, ఎసి సర్వీసులలో రూ. 5 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది. పెంచిన ఛార్జీలు రేపటి నుండి అమలులోకి రానున్నాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రతిరోజూ ఆర్టీసీ 6 లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తుందని, ఇటీవల కాలంలో చమురు ధరలు అసాధారణ రీతిలో పెరిగి పోవడంతో డీజిల్ సెస్ వసూలు చేయాలని నిర్ణయించినట్లు, ప్రజలు సహకరించాలని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఎండి సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.