టిఎస్ఆర్‌టిసి మ‌రో రాయితీ ప‌థ‌కం..

రూ.50 చెల్లించి.. 30 కి.మీ మేర రానుపోను ప్ర‌యాణం..

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ ఆర్‌టిసి మ‌రో రాయితీని ప్ర‌క‌టించింది. రాష్ట్రంలోని ప‌ల్లెవెలుగు ప్రాయ‌ణికుల‌కు కొత్త‌గా టి9-30 టికెట్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. రూ.50 చెల్లించి టికెట్ తీసుకొని 30 కిలో మీట‌ర్ల మేర రానుపోను ప్ర‌యాణం చేసే స‌దుపాయం క‌ల్పించింది. ఉద‌యం 9 గంట‌ల నుండి రాత్రి 9 గంట‌ల లోపు మాత్ర‌మే ఈ టికెట్ వ‌ర్తిస్తుంది. ఈ ప‌థ‌కం రేప‌టి నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లులోకి రానుంది. ఈ ప‌థ‌కం నెల రోజులు మాత్ర‌మే అందుబాటులో ఉండ‌నుంది. నెల‌రోజుల త‌ర్వాత ప్ర‌యాణికుల నుండి వ‌చ్చే స్పంద‌న‌ను బ‌ట్టి దీనిని పొడిగించాలా లేదా అని నిర్ణ‌యం తీసుకోనున్నారు. అయితే ఇప్ప‌టికే టి9-60 రాయితీ అమ‌లులో ఉన్న విష‌యం తెలిసిందే.

మ‌హిళ‌ల‌కు, సీనియ‌ర్ సిటిజ‌న్‌ల కోసం అందుబాటులోకి తెచ్చిన టి9-60 టికెట్ పురుషుల‌కు కూడా వ‌ర్తించ‌న‌ట్లు ఆర్‌టిసి ఎండి స‌జ్జ‌నార్ వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.