TSRTC: పల్లెవెలుగు టౌన్ బస్‌పాస్..
హైదరాబాద్ (CLiC2NEWS): ప్రయాణికులకు టిఎస్ ఆర్‌టిసి శుభవార్త అందించింది. జిల్లా కేంద్రాల్లో పల్లెవెలుగు టౌన్ బస్‌పాస్‌లు అందించాలని నిర్ణయించింది. ముందుగా నాలుగు (కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ) జిల్లా కేంద్రాల్లో రేపటి నుండి అమలు చేయాలని టిఎస్ఆర్టిసి ఎండి సజ్జనార్ తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్‌లో జనరల్ బస్‌పాస్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.
జులై 18వ తేదీ నుండి టౌన్ పాస్‌లు అందుబాటులోకి రానున్నాయి. కరీంనగర్, మహబూబ్ నగర్‌లలో 10 కిలో మీటర్లు, నిజామాబాద్ నల్లగొండలలో 5 కిలో మీటర్లు పరిధిలో ఈ టైన్ బస్‌పాస్‌లను వినియోగించుకోవచ్చు. 10 కిలో మీటర్లు పరిధికి నెలకు రూ. 800, 5 కిలో మీటర్ల పరిధికి రూ. 500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణికుల నుండి వచ్చే స్పందనను బట్టి మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. సోమవారం పల్లె వెలుగు టౌన్ బస్‌పాస్ పోస్టర్లను ఎండి సజ్జనార్ ఆర్‌టిసి అధికారులతో కలిసిఆవిష్కరించారు.