రష్యా, జపాన్ ను తాకిన సునామీ
8.8 తీవ్రతో భూకంపం
మాస్కో (CLiC2NEWS): రష్యా పసిఫిక్ తీరంలోని కామ్ చట్కా ద్వీపంలో బుధవారం అత్యంత శక్తిమంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై ఆ భూకంప తీవ్రత 8.8గా నమోదు అయింది. ఇప్పటి వరకు సంభవించిన భూకంపాలలో ఈ భూకంపం 6వ శక్తిమంతమైన దని భూగర్భ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ క్రమంలో రష్యాలోని కామ్ చట్కా తో పాటు జపాన్ కూడా సునామి హెచ్చరికలు జారీ చేశారు. ఈ హెచ్చరికలు జారీ చేసిన కొద్ది సేపటికే రష్యా, జపాన్‌లను సునామీ తాకింది.
కాగా జపాన్‌లోని హక్వైడో నుంచి 250 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
రష్యాలోని పెట్రోపావ్లోవ్స్క్, కామ్చాట్‌స్కీ నగరాల్లో ప్రజలంతా ఇళ్లను వీడి భయటకు పరుగులు పెట్టారు. కాగా ఇప్పటి వరకు ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం తెలియదు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, సెల్ ఫోన్ సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. కాగా భూకంపానికి ఇళ్లు, షాపుల్లో ప్రకంపనలకు సంబంధించిన విడియోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
🚨🚨 BREAKING NEWS 🚨🚨
USGS has upgraded the earthquake to a massive 8.7 magnitude!
The powerful quake struck off the eastern coast of Russia.
There is a serious tsunami threat.
Japan, Hawaii, and Alaska are on high alert.Story still developing…#earthquake #Tsunami… pic.twitter.com/lxIK7ufvp1
— SavronX (@savronnX) July 30, 2025


[…] తప్పకచదవండి: రష్యా, జపాన్ ను తాకిన సునామీ […]
[…] తప్పక చదవండి: రష్యా, జపాన్ ను తాకిన సునామీ […]