TTD: ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల

తిరుమల (CLiC2NEWS): తిరుమలేశుని భక్తుల సౌకర్యార్థం జూలై నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం మంగళవారం ఉదయం విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే టికెట్లను అందుబాటులో ఉంచింది. రోజుకు ఐదువేల చొప్పున టికెట్లను మాత్రమే ఆన్లైన్లో విడుదల చేసింది. జూలై నెలకు సంబంధించిన అద్దె గదుల కోటాను బుధవారం ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు టిటిడి పేర్కొంది.