నెయ్యి కల్తీ వ్యవహారం.. పోలీసులకు టిటిడి ఫిర్యాదు

తిరుపతి (CLiC2NEWS): తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిన విషయం తెలిసినదే. ఈఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఆర్ డెయిరీ సంస్థపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టిటిడి ప్రొక్యూర్మెంట్ జిఎం మురళీకృష్ణ తిరుపతి తూర్పు పిఎస్ లో ఫిర్యాదు చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా నెయ్యి సరఫరాచేశారని.. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం.. సిట్ చీఫ్గా సర్వశ్రేష్ట త్రిపాఠి