TTD: కాలినడక దారిలో 10 మీటర్లకో సెక్యూరిటీ గార్డు..
![](https://clic2news.com/wp-content/uploads/2023/08/eo-Dharmareddy.jpg)
తిరుమల (CLiC2NEWS): చిరుత దాడిలో ఆరు సంవత్సరాల చిన్నారి మృతి చెందిన ఘటనలో తిరుమల తిరుపతి దేవస్థానం ఇఒ ధర్మారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మట్టాడుతూ… అలిపిరి కాలినడక దారిలో చిన్నారి లక్షిత మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. ఈ నేపథ్యంలో తిరుమల జెఇఒ కార్యాలయంలో అటవీశాఖ, పోలీసు ఉన్నతాధికారులతో ఇఒ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శుక్రవారం సాయంత్రం అలిపిరి దారిలో సాయంత్రం ఆరు తరువాత చిన్నారి తప్పిపోయిందన్నారు. లక్షిత ఆచూకీ కోసం దాదాపు 70 మందికిపగా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారని ఇఒ తెలిపారు. సిసికెమెరాల ద్వారా పరిశీలిస్తే కాలినడక మార్గంలో చిరుత దాడి జరగలేదు.. ఈ క్రమంలో కాలినడక నుంచి చిన్నారి అటవీ ప్రాంతంలోకి వెళ్లిందా? అనే కోణంలో దర్యాప్తు చెపట్టామని తెలిపారు. కాగా చిరుతను బంధించేందుకు రెండు బోన్లను ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో రెండు కాలినడక మార్గాలను సాయంత్రం 6 గంటల తరువాత మూసివేయాలని ఆలోచనలు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ఈ విషయంపై అధికారులు, టిటిడి చైర్మన్‌తో చర్చించినిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే ప్రతి 10 మీటర్లకు ఒక సెక్యూరిటీ గార్డును నియమిస్తామని ఇఒ ధర్మారెడ్డి తెలిపారు.