మిగ్జాం తుఫాను.. శ్రీవారి మెట్టు మార్గం రాకపోకలు నిలిపివేత

తిరుమల (CLiC2NEWS): మిగ్జాం తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు , తిరుపతి, చెన్నై పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలలోని పర్యాటక ప్రదేశాల సందర్శనను తాత్కాలింగా రద్దు చేశారు. ఈ మేరకు శ్రీవారి మెట్టు మార్గంలోని భక్తుల రాకపోకలను నిలిపివేసినట్లు టిటిటి అధికారలు ప్రకటనలో తెలిపారు. భారీగా చెట్లు నేలకొరగటం, ఎడతెరిపిలేని వర్షం కారణంగా పాపవినాశన రోడ్డులోని జాపాలి ఆలయం, ఆకాశగంగ తదితర ప్రదేశాల సందర్శనకు వెళ్లే భక్తులను నిలిపివేశారు.