TTD: వచ్చే నెల 7న శ్రీవారి ఆలయం మూసివేత
తిరుమల (CLiC2NEWS): సెప్టెంబర్ 7వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. వచ్చే నెల 7వ తేదీ ఆదివారం చంద్ర గ్రహణం కారణంగా దాదాపు 12 గంటల పాటు ఆలయం మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటనలో తెలిపింది. ఆరోజు రాత్రి 9.50 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి 1.31 గంటలకు ముగుస్తుంది. సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం ఆలయ తలుపులు తెరుస్తారు. 6 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
Also Read: Mandapet: మహిళకు ఉచిత ‘ఎగ్ కార్ట్’ పంపిణీ
[…] […]